Nick Jonas: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కొత్త సినిమా “వారణాసి” తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు హిరోగా, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. మహేష్ బాబు – రాజమౌళి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ఈ సినిమాపై తన ఫస్ట్ రియాక్షన్‌ను వెల్లడించారు.
READ ALSO: Saudi Arabia Bus Accident: మక్కాలోనే ఆ 18 మంది అంత్యక్రియలు!
నవంబర్ 15న మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది. టీజర్‌తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రత్యేకమైన ఈవెంట్‌లో విడుదలైంది. ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ అదే పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి సినిమాపై స్పందించారు. నిక్ జోనాస్ తన పోస్ట్‌లో ” ఈ చిత్రంలో పాల్గొన్న మొత్తం బృందానికి అభినందనలు.. ఈ చిత్రం నిజంగా అద్భుతంగా ఉంటుంది” అని రాసుకొచ్చారు. నవంబర్ 12న ఈ సినిమా మేకర్స్ చిత్రం నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రియాంక చోప్రా పసుపు రంగు చీర ధరించి తుపాకీ పట్టుకుని కనిపించి అభిమానులను అలరించారు. “వారణాసి” సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని 2027 లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ సుమారుగా రూ.1,000 కోట్లు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
READ ALSO: Sheikh Hasina Reaction: మరణశిక్షపై బంగ్లా మాజీ ప్రధాని హసీనా తొలి స్పందన ఇదే..
