Site icon NTV Telugu

RRR : మేకర్స్ ను కలవర పెడుతున్న మరో సమస్య

rrr

“ఆర్ఆర్ఆర్” మూవీ విడుదల సమయానికే ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. పలు వాయిదాల అనంతరం సినిమాను ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరో సమస్య మేకర్స్‌ని కలవరపెడుతోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌లను పరీక్షా సీజన్‌లుగా పరిగణిస్తారు. అందువల్ల పెద్ద సినిమాలు ఆ సమయంలో ఎక్కువగా విడుదల కావు. అయితే ఈ సంవత్సరం మాత్రం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే కోవిడ్-19 థర్డ్ వేవ్ కారణంగా జనవరిలో చాలా విద్యా సంస్థలు మూతబడ్డాయి. తిరిగి తెరిచిన తర్వాత మే వరకు సంస్థలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి.

Read Also : RGV : హీరోస్ ఆర్ జీరోస్… ఆయన చుట్టూ జూనియర్ ఆర్టిస్టుల్లా…

పైగా మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది. ఈసారి 10 జట్లతో టోర్నమెంట్ చాలా లాంగ్ ఉంటుంది. దీంతో ఇప్పుడు విద్యార్థులు పరీక్షలతో పాటు ఐపీఎల్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు గండంగా మారింది. ప్ర‌స్తుతం ట్రేడ్ పండితులు సినిమాకి ఈ అవ‌రోధాలు వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. వాటిని ‘ఆర్ఆర్ఆర్’ ఎలా అధిగమిస్తుంది ? అన్నదే అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version