Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను నిన్న తిరుపతిలో లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ తోనే కథ, జానర్ అన్నీ చెప్పేశారు. ఈ ట్రైలర్ లో విలన్ కొత్త వ్యక్తి. ఈ ట్రైలర్ లో ప్రధానంగా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ తో పాటు విలన్ కూడా ఎక్కువ సేపు కనిపించాడు. ఇంతకీ ఈ విలన్ ఎవరనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ విలన్ గా నటించిన వ్యక్తి పేరు వెంకటేశ్ పీవీ. ఇతను మలయాళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఇతను అక్కడ 2014 నుంచి సినిమాలు చేస్తున్నాడు.
Read Also : HHVM : తగ్గిన వీరమల్లు టికెట్ రేట్లు..
కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించాడు. అక్కడ చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్‌లో కీలక పాత్రలు చేశారు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ‘రెబల్’ మూవీలోనూ విలన్ గా చేసి మెప్పించాడు. ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసి కింగ్ డమ్ లో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అతని విలనిజం కొత్తగా అనిపిస్తోంది. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ మెప్పిస్తే మాత్రం టాలీవుడ్ కు కొత్త విలన్ దొరికినట్టే అంటున్నారు మన ట్రేడ్ పండితులు.
Read Also : HHVM : పురాణాల ఆధారంగా పవన్ పాత్ర.. జ్యోతికృష్ణ క్లారిటీ
