PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్

Tollywood

Tollywood

టాలీవుడ్ లో ఇటీవల థియేటర్ రెంట్ vs పర్సెంటేజ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిర్మాతలు వర్గం, ఎగ్జిబిటర్స్ వర్గం రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఆ ప్రభావం ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’పై పడుతుందని బావించారు. కానీ పర్సెంటేజ్ విధానంపై అందరు ఒకేమాటపై ఎలాంటి అడ్డంకులు లేకుండా పెద్ది రిలీజ్ కు సహకరించారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది భారీ ఎత్తున రిలీజ్ అయింది.

అయితే ఇప్పుడు ‘పెద్ది’ పర్సెంటేజీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.  నైజాంలో పెద్ది టికెట్ల ధరల పెంపుదల ద్వారా వచ్చే వసూళ్లలో ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఒప్పందంపై ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు స్పందిస్తూ  ‘అసలు ఈ 7.5 శాతం అదనపు వాటా హామీ గురించి తనకు అసలు సమాచారమే లేదు, తన అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల ఈ విషయాలు నా దృష్టికి రాలేదని, అందువల్ల ఈ కమిట్‌మెంట్‌ను తాను అంగీకరించలేనని లేఖ విడుదల చేశారు.

×
×
Ad

నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలపై ఫిలిం ఛాంబర్ గట్టిగానే కౌంటర్ ఇస్తూ  ‘ఈ వ్యవహారానికి సంబంధించి మే 27వ తేదీనే సదరు నిర్మాతకు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించాము. ప్రెస్ నోట్‌తో పాటు ఈ కమిట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను మే 27నే ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌కు ఈమెయిల్ తో పాటు కొరియర్ ద్వారా డాక్యుమెంట్స్ పంపాము. ఇప్పడు మాకు తెలియదు అంటే కుదరదు’ అని నిర్మాతకు కౌంటర్ గా లెటర్ రిలీజ్ చేసింది ఛాంబర్. అయితే దీనిపై జూన్ 15న నిర్మాత నుండి తిరస్కరణ సమాధానం రావడంపై ఎగ్జిబిటర్ల సబ్-కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పడు ఈ వివాదం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.