కొత్త సంవత్సరం.. కొత్త ప్రారంభం.. కొత్త జీవితం.. సినీ ఇండస్ట్రీలో గతేడాది కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ జ్ఞాపకాలను వదిలేసి.. న్యూ ఇయర్ లో సరికొత్త విజయాలను అందుకోవడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఇక నేడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్త చిత్రాలు.. తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్నా “బోళా శంకర్”.. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ”స్వాతిముత్యం”. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్ లో హీరోహీరోయిన్లు ఒకరి కౌగిలిలో మరొకరు ఒదిగిపోయి కనిపించారు. దీని బట్టి ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్నదని తెలుస్తోంది.
ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హైవే”. పుష్పక విమానం చిత్రంతో దెబ్బ తిన్న ఆనంద్ దేవరకొండ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో రెడీ అయిపోయాడు. సైకో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆది సుకుమార్ నటించిన తీస్ మార్ ఖాన్, తాజ్ తరుణ్ నటినహీన స్టాండ్ అప్ రాహుల్, సత్య దేవ్ నటించిన గుర్తుందా శీతాకాలం , గాడ్సే, రానా నటించిన విరాట పర్వం.. తదితర సినిమాలు తమ కొత్త పోస్టర్లను రిలీజ్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ ని తెలిపాయి.
