OTT Releases: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌లతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లు ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. వీటన్నిటిని ఫ్యామిలీలతో కలసి కూడా చూస్తూ కూడా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి వాటి పేర్లు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలపై ఓ లుక్ వేద్దాం పదండి.
న్యూటన్స్ థర్డ్ లా
సుమంత్ హీరోగా, జగపతి బాబు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ చిత్రం ఒక రసవత్తరమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్. 1999లో జరిగిన రెండు విచిత్రమైన హత్యల చుట్టూ తిరిగే ఈ కథలో పోలీస్, క్రిమినల్ మైండ్ గేమ్‌లు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. థియేటర్లలో 2026 జూలై 31న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Netflix వేదికగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.
ఆల్ఫా
యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘స్పై యూనివర్స్’ నుంచి వచ్చిన మొదటి ఫిమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో సాగే ఈ హై-వోల్టేజ్ మూవీ థియేటర్ రిలీజ్ జూలై 3న కాగా ఓటీటీలో 2026 ఆగస్టు 28 నుంచి Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.
అన్బే డయానా
థియేటర్లలో 2026 జూలై 17న వచ్చిన ఈ తమిళ రొమాంటిక్ కామెడీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హిందూ యువకుడు మరియు క్రిస్టియన్ యువతి మధ్య చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా ఇది. సీనియర్ నటి రోజా ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 28 SonyLIV ప్లాట్‌ఫామ్‌లో తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
హరుడు
హెబ్బా పటేల్, వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక సస్పెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. కథలో వచ్చే ట్విస్టులు, ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆగస్టు 28 నుంచి Aha Video డిజిటల్ వేదికలో అందుబాటులో ఉంది.
పార్ట్ టైమర్స్
ఈ రోజుల్లో యూత్ పడే పాట్లు, పార్ట్ టైమ్ ఉద్యోగాల నేపథ్యంలో సాగే ఒక సరదా యూత్‌ఫుల్ వెబ్ సిరీస్ ఇది. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామి ఈ సిరీస్‌లో లీడ్ రోల్‌లో నటించారు. ఈ ఎంటర్‌టైనింగ్ సిరీస్ ప్రస్తుతం JioHotstar లో స్ట్రీమింగ్ అవుతోంది.
అంకం అట్టహాసం
పగ, ప్రతీకారం, ఇంటెన్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ క్రైమ్ మూవీ ఇది. గ్రామీణ నేపథ్యం, నటీనటుల ప్రతిభావంతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ మలయాళ క్రైమ్ డ్రామా మే 8న థియేటర్లలో సక్సెస్ సాధించిన తర్వాత ఆగస్టు 28 Sun NXT ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం Sun NXT ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో లభిస్తోంది.
ఏఎస్సై బబితా సింగ్ రిపోర్టింగ్
నిమిషా సజయన్ లీడ్ రోల్ లో వస్తున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కామెడీ కలగలిపిన ఒక కొత్త వెబ్ సిరీస్. ఒక చిన్న ఊరిలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)గా జాయిన్ అయిన బబితా సింగ్, అక్కడ జరిగే ఒక విచిత్రమైన క్రైమ్ కేసును తనదైన స్టైల్లో ఎలా సాల్వ్ చేసింది అనేదే ఈ సిరీస్ కథ. కేసు ఇన్వెస్టిగేషన్ సీరియస్‌గా సాగుతూనే, మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఈ సిరీస్ ఆగస్టు 28నుంచి Prime Video లో అందుబాటులో ఉంది.
కరావళి
‘కరావళి’ కర్ణాటక స్పెషల్ బఫెలో రేస్ ‘కంబాల’ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఒక రఫ్ అండ్ రస్టిక్ యాక్షన్ సినిమా. గురుదత్ గనిగ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రజ్వల్ దేవరాజ్, రాజ్ బి. శెట్టి మెయిన్ రోల్స్ ప్లే చేశారు. ఇది జూలై 24, 2026న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘జీ5’ (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఊరిలో కంబాల ఆట చుట్టూ జరిగే రాజకీయాలు, మనుషులకు అడవి జంతువులకు మధ్య జరిగే పోరాటాన్ని కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ సచిన్ బస్రూర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాలో చూపించారు.

