NTV Telugu Site icon

Adipurush: మరో కొత్త వివాదంలో ‘ఆదిపురుష్’! ఈ కర్ణుడి కష్టాలేంటో?

Adipurush

Adipurush

ఆదిపురుష్‌ సినిమాకు వివాదాలు కొత్త కాదు. ఈ సినిమా స్టార్ట్ అయిప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తునే ఉంది. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ పై అనుమానాలు పెరిగిపోయాయి. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమన్నాయి. అయితే రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ విమర్శలకు చెక్ పెట్టేసింది. టీజర్‌తో వచ్చిన గ్రాఫిక్స్ నెగెటివిటీని దూరం చేయడంతో పాటు.. సినిమాపై అంచనాలని కూడా పెంచేసింది. ఈ విషయంలో మేకర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంది. దాంతో డైరెక్టర్ ఓం రౌత్.. యే దోస్తీ అంటూ ప్రభాస్‌తో కలిసి ఉన్న ఓ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసుకున్నాడు. అందులో పక్క పక్కనే 3డి గ్లాసెస్ పెట్టుకొని ట్రైలర్ చూస్తున్నారు ఇద్దరు. ఈ సందర్భంగా ఆదిపురుష్ ట్రైలర్ రెస్పాన్స్‌కి అందరికీ థాంక్స్ చెప్పాడు. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ పై మరో కొత్త వివాదం తగులుకుంది. ఈ సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డులో.. సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ బాంబే హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా ఫిర్యాదు చేశారు.

Read Also: CM Jaganmohan Reddy Live: కావలిలో సీఎం జగన్ బహిరంగసభ

ఆదిపురుష్ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మేకర్స్ పోస్టర్స్, టీజర్‌లో చేసిన మిస్టేక్స్ సినిమాలో కూడా ఉంటే, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే సినిమా రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా సెన్సార్ షిప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే… గతంలో ఆదిపురుష్‌ పై విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి సైతం ట్రైలర్ చూసి ప్రశంసించారు. పైగా సెన్సార్ అయిన తర్వాతే సినిమా థియేటర్లోకి వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఫిర్యాదులు అనవసరం అనేది.. నెటిజన్స్ టాక్. మరి జూన్ 16న ఆదిపురుష్ ఏం చేస్తాడో చూడాలి.

Show comments