Site icon NTV Telugu

‘ఆర్ఆర్ఆర్’ టీషర్ట్స్, టీ కప్స్, ఫేస్ మాస్కులు…

Business Started on RRR Name

ప్రస్తుతం ఇండియాలో నిర్మాణంలో ఉన్న బిగ్ మూవీస్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. వాస్తవానికి దసరాకి రిలీజ్ కావలసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీనికి కారణ టికెట్ల రేటుతో థియేటర్ల నిర్వహణ కూడా కారణాలుగా ప్రచారం జరుగుతోంది. ఇది ఎన్టీఆర్, చరణ్‌, రాజమౌళి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా నిరాశపరిచింది. అయితే తీనిని భర్తీ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కొన్ని కొత్త కొత్త ప్లాన్స్ ను అమలు చేయబోతోంది. అందులో ఒకటి ‘ఆర్ఆర్ఆర్’ వస్తు వ్యాపారం. దీనిలో భాగంగా రానా దగ్గుబాటి ఈ వ్యాపారపు తొలి కలెక్షన్‌ను లాంచ్ చేశాడు.

Read Also : “లైగర్”కు బాలయ్య సర్ప్రైజ్

ఈ కలెక్షన్ లో భాగంగా టీ షర్ట్స్, కాఫీ మగ్స్, పోస్టర్స్, బ్యాడ్జెట్స్ తో పాటు ఫేస్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. టీ-షర్టుల ధరను రూ .599 గా నిర్ణయించారు. ఇవి నాలుగు తరహాల డిజైన్స్ లో లభ్యం అవుతున్నాయి. రామ్ చరణ్ గర్జనతో కూడినవి, ఎన్టీఆర్ బుల్లెట్ స్వారీ చేస్తున్న రెండు డిజైన్‌లు వారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కాఫీ మగ్స్ రూ .399 కి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫేస్ మాస్క్ ఒకటి రూ .149. వీటితో పాటు నోట్‌బుక్స్, పాప్ గ్రిప్ కూడా ఉన్నాయి. ఈ తొలి కలెక్షన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయట. ఈ వ్యాపారాన్ని ఫుల్లీ ఫిల్మీ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాప్ కల్చర్ స్టోర్ కావటం విశేషం. మరి మునుముందు ‘ఆర్ఆర్ఆర్’ మర్చంటైజ్ ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో చూద్దాం.

Exit mobile version