Site icon NTV Telugu

Deepika Padukone: రణబీర్ ను మర్చిపోలేక ఆ పని చేస్తున్న దీపికా..?

Deepika

Deepika

బాలీవుడ్ ప్రేమ జంట అలియా- రణబీర్ ల పెళ్లి కార్యక్రమాలు మొదలైపోయాయి. బాలీవుడ్ అంతా ఆర్కే హౌస్ ముంచు ప్రత్యేక్షమైపోయింది. రిషీ కపూర్ నీతూ సింగ్ లతో సహా కపూర్ ఫ్యామిలీకి చెందిన చాలా మంది పెళ్లిళ్లు ఆర్కే హౌస్ లోనే జరిగిన సంగతి తెల్సిందే. ఇక వీరి పెళ్లి కూడా ఇక్కడే జరగనుంది. నేటి ఉదయం పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ పెళ్లి తంతు సాయంత్రం మెహందీ ఫంక్షన్ తో ముగియనుంది.

ఇక సెలబ్రిటీలు అలియా- రణబీర్ ల పెళ్ళి వేడుకలకు వెళ్తూ కెమెరాల కంటికి చిక్కడం.. ఆ ఫోటోలు కాస్తా వైరల్ గా మారడం చకచకా జరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ప్రేమ జంట పెళ్లి హాట్ టాపిక్ గా మారగా అంతకంటే ఎక్కువ హాట్ టాపిక్ గా మారింది దీపికా పదుకొనె విదేశాలకు వెళ్లడం.. రణ్ బీర్ పెళ్లికి హాజరు కాకుండా దీపిక ముంబైని వీడి విదేశాలకు వెళ్లడంతో ఫ్యాన్స్ ఆమెపై మండి పడుతున్నారు.

మొన్నటికి మొన్న విక్కీ కౌశల్.. కత్రినా కైఫ్ వెడ్డింగ్ కు కూడా దీపికా అటెండ్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ స్టార్ జంట పెళ్ళికి ఎక్కడ అటెండ్ అవ్వాల్సి వస్తుందేమో అని ముందుగానే ప్లాన్ చేసి ఫారిన్ చెక్కేసిందా..? అనే అనుమానాలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్ళికి దీపికా అటెండ్ కాకపోవడానికి కారణం రణబీర్ ని ఆమె ఇంకా మర్చిపోలేక పోవడమేనాని మరికొందరు అంటున్నారు. రణబీర్, దీపికా ల మధ్య నడిచిన లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ జంట చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

కొన్ని విభేదాల వలన ఈ జంట విడిపోయిన సంగతి కూడా తెల్సిందే. ఆ తరువాత రణబీర్, అలియా ప్రేమలో పడగా.. దీపికా, రణవీర్ ప్రేమలో పడి, అతడితో మూడు ముళ్ళు వేయించుకుంది. అంత అయిపోయాక ఇప్పుడు పెళ్ళికి రావడానికి ఎందుకు సంకోచిస్తుంది.. అంటే ఇప్పటికీ దీపికా, రణబీర్ ని ప్రేమిస్తుందా..? అతడిని మర్చిపోలేక, అతడిపై ఈర్ష్యతో ముంబై వీడి వెళ్లిందా ..? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క మరికొందరు దీపికాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమెకున్న షెడ్యూల్ ని బట్టి ఆమె విదేశాలకు వెళ్లి ఉంటుంది.. ఒక నటిగా ఆమె షెడ్యూల్ ఆమె చూసుకోవడం లో తప్పేంటి..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్ లో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియాలంటే దీపికా నోరు విప్పాల్సిందే.

Exit mobile version