Site icon NTV Telugu

Ranveer Singh: నువ్వో పెద్ద ఫిగర్ వా.. నీ ఫోటో మార్ఫింగ్ చేయడానికి

Ranveer

Ranveer

Ranveer Singh: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి అబద్దాలు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసి ఇప్పుడు పోలీసులు వచ్చి అడిగితే అది మార్ఫింగ్ ఫోటో అని ఎలా చెప్తారని చెప్పుకొచ్చారు. అసలు విషయమేంటంటే.. గత కొన్ని రోజుల క్రితం రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ చేశాడు. ఒక మ్యాగజైన్ కోసం ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక ఈ ఫోటోషూట్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఒక స్టార్ హీరో ఇలాంటి ఫోటోషూట్ చేయడమేంటని, ఈ ఫోటోషూట్ వలన మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు గత వారం రణవీర్ పై ప్రశ్నలు వర్షం కురిపించారు. అప్పుడు పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు మౌనంగా ఉన్న ఈ హీరో.. తాజాగా జరిగిన మరో విచారణలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది తన ఫోటో కాదని, తన ఫోటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

ఇక దీంతో ఈ స్టేట్మెంట్ పై ఒక్కసారిగా నెటిజన్లు ధ్వజమెత్తారు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఎలాంటి అబద్దమైనా చెప్తావా అంటూ ఆగ్రహిస్తున్నారు. అది మార్ఫింగ్ ఫోటో అయితే సోషల్ మీడియాలో నువ్వెందుకు పోస్ట్ చేసావ్..? అప్పుడే ఎందుకు మీడియా ముందుకు వచ్చి అది మార్ఫింగ్ ఫోటో అని చెప్పలేదు..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు.. అవును.. నువ్వో పెద్ద ఫిగర్ మరీ.. నీ ఫోటోను మార్ఫింగ్ చేసి వైరల్ చేయడానికి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం రణవీర్ స్టేట్మెంట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి పోలీసులు రణవీర్ సమాధానంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version