NTV Telugu Site icon

Sai Pallavi: బెస్ట్ హీరోయిన్ గా పూజా.. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంది..?

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా సినిమాల్లో మొదటి ఛాయిస్ గా మారిన పూజా తాజాగా సైమా అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ గా అవార్డు గెలుచుకొంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి గాను ఆమె ఈ అవార్డును సొంతం చేసుకొంది. ఇక ఇదే ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడానికి అవకాశంగా మారింది. ఉదయం నుంచి పూజాను నీతిజ్ఞలు ట్రోల్ చేస్తున్నారు. ఆ అవార్డు ఆమె డబ్బులు పెట్టి తెచ్చుకొందని చెప్పుకొస్తున్నారు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. బెస్ట్ హీరోయిన్ నామినేషన్స్ లో పూజా తో పాటు సాయి పల్లవి కూడా ఉంది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు గాను సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయ్యింది. అయితే ఈ రెండు చిత్రాల్లో సాయి పల్లవి నటన అద్భుతం.

ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ చిత్రంలో ఆమె డ్యాన్స్ కు కానీ, నటనకు కానీ ఫిదా కానీ వారుండరు. అంతటి నటన కనపర్చిన సాయి పల్లవిని వదిలేసి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో హీరోయిన్ గా నటించిన పూజకు అవార్డు ఎలా ఇస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాలో పూజా ఒక నార్మల్ అమ్మాయి క్యారెక్టర్ చేసింది. పెళ్లి చేసుకోనేవాడు ఎలా ఉండాలి అని హీరోను కన్ప్యూజ్ చేసి చివరికి ఇలా ఉండాలి అని చెప్పి హీరోను పెళ్లాడుతోంది. ఇందులో ఛాలెంజింగ్ ఏం ఉందని అంటున్నారు. కావాలనే ఈ అవార్డు ను సాయి పల్లవి కి రానివ్వకుండా చేశారని, పూజా డబ్బులు ఇచ్చి అవార్డు తెచ్చుకొందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments