NTV Telugu Site icon

Chiranjeevi: చిరుపై మరోసారి ట్రోలింగ్.. మీమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా

Chiru

Chiru

Chiranjeevi: తెలంగాణలో ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ పనులను పక్కన పెట్టి ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి .. లైన్లో నిలబడి మరి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఓటు యొక్క గొప్పతనం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక ఉదయం మెగాస్టార్ చిరంజీవి.. తన కుటుంబంతో సహా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆయన.. రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మరోసారి ట్రోలింగ్ కు గురయ్యారు. గత కొన్నిరోజులగా చిరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయం తెల్సిందే. త్రిష- మన్సూర్ ఆలీఖాన్ వివాదంలో చిరు ట్వీట్ వేయడంతో ఈ ట్రోలింగ్ మొదలయ్యింది. దీనికి తోడు.. మన్సూర్ .. చిరు గురించి కూడా ఘాటు ఆరోపణలు చేశాడు. ఇంకా ఈ వివాదం ముగియలేదు. ఇక ఇప్పుడు మరోసారి చిరు.. కొత్త ట్రోలింగ్ కంటెంట్ గా మారారు.

Dhoomam : నేరుగా ఓటీటీ లోకి వచ్చేసిన ఫహాద్ ఫాజిల్ “ధూమం”

నేడు జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ వద్దకు భార్య సురేఖ, కూతురు శ్రీజతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు చిరంజీవి. ఇక అందరి సెలబ్రిటీలను అడిగినట్లే.. రిపోర్టర్స్.. చిరును కూడా ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించారు. దానికి చిరు.. మౌనవ్రతం అని నోటితో చెప్పి.. ప్రశ్నలు అడగవద్దని సైగలు చేశారు.సదురు రిపోర్టర్ ఎన్నిసార్లు ప్రశ్న వేయడానికి ట్రై చేసినా.. గొంతు బాలేదని చెప్పి తప్పించుకున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీమ్స్ వేసి నెటిజన్స్ ఆడుకుంటున్నారు. ఆ ఒక్క ముక్క మాత్రమే చెప్పాలి.. అదే మౌనవ్రతం అని కామెడీ చేస్తున్నారు. ఏదిఏమైనా ట్రోల్ అవ్వకూడదు అని చిరు మాట్లాడడం మానేస్తే.. ఆయన నోరు విప్పకపోయినా ట్రోల్ మాత్రం ఆగలేదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments