Site icon NTV Telugu

లతాజీ అంత్యక్రియల్లో షారుఖ్ చేసిన పనిపై విమర్శలు… కానీ… !?

SRK

భారతదేశపు నైటింగేల్ లతా మంగేష్కర్ ఆదివారం మనందరినీ విడిచి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. లతా మంగేష్కర్ మరణం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ లెజెండరీ సింగర్ కు కడసారి నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పటు రాజకీయ నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు కూడా నిన్న ఆమె ఇంటికి చేరుకున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా లతా మంగేష్కర్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అయితే లతాజీకి నివాళి అర్పించే సమయంలో షారుక్ చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : ‘జనగణమన’ కీలక అప్డేట్… ‘లైగర్’ పని అయిపోయినట్టే !

అసలు షారుఖ్ ఏం చేశాడంటే… షారుఖ్ తన మేనేజర్‌తో కలిసి లతా మంగేష్కర్‌కు నివాళులర్పించడానికి వచ్చాడు. ఆ సమయంలో ఆయన లతా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చదివి, ఆపై మాస్క్ ను కిందకి దించాడు. ప్రార్థన తర్వాత ఆయన లతా మంగేష్కర్ పాదాల దగ్గర ఊదాడు. అయితే షారుఖ్ దీనిని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు షారుఖ్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. లతా పాదాల దగ్గర షారుక్ ఉమ్మేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ సైడ్ నిలుస్తూ, ట్రోలర్లపై విరుచుకు పడుతున్నారు. స్వర భాస్కర్, అశోక్ పండిట్ వంటి వారు షారుఖ్ చేసిన ప్రార్ధనా విధానాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Exit mobile version