NTV Telugu Site icon

Ram Charan: బ్రేకింగ్.. నెట్ ఫ్లిక్ సీఈఓ తో మెగా ఫ్యామిలీ భేటీ..

Chiru

Chiru

Ram Charan: హైదరాబాద్ లో ఒక పవర్ హౌస్ సమావేశం జరిగింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మొట్ట మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేశాడు. ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి చేరుకొని మెగా ఫ్యామిలీతో ముచ్చటించారు. ఇప్పటివరకు ఇలాంటి సమావేశం టాలీవడో లో ఎప్పుడు జరగలేదు. నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ మెగా కుటుంబాన్ని కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి, రామ్ చరణ్, పంజా బ్రదర్స్ సాయి తేజ్, వైష్ణవ్ తేజ్.. నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ తో కొద్దిసేపు ముచ్చటించారు.

ఓటిటీ గురించి, సినిమాల గురించి వారి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇంత సడెన్ గా నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్.. మెగా ఫ్యామిలీని కలవడం వెనుక అంతరార్థం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరూ.. ఓటిటీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకవేళ ఏదైనా సిరీస్ కోసం మెగా ఫ్యామిలీని సంప్రదించడానికి ఆయన వచ్చారా.. ? లేక మెగా ఫ్యామిలీనే ఆయనకు ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచారా.. ? అనేది సస్పెన్స్ గా మారింది. ఏదిఏమైనా నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్ .. హైదరాబాద్ వచ్చి మెగా ఫ్యామిలీతో భేటీ అవ్వడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. అది మెగా ఫ్యామిలీ గొప్పతరం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు ఏమైనా అనౌన్స్ మెంట్ ఉంటుందేమో చూడాలి.

Show comments