NTV Telugu Site icon

Radhe Shyam : ఓటిటి డేట్… ఫైనల్ గా రిప్లై ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్‌

Radheshyam

Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భాయ్ బడ్జెట్ తో నిర్మించింది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించగా, ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించారు. భారీ అంచనాలతో మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ప్రేక్షకులకు నిరుత్సాహ పరిచింది. ఇక “రాధే శ్యామ్” ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకయిన “రాధేశ్యామ్” ఓటిటి, టెలివిజన్లలో మాత్రం మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా హిందీలో… కాగా ఇప్పుడు ‘రాధేశ్యామ్’ ఓటిటి రిలీజ్ గురించి బీటౌన్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Read Also : Mahesh Babu : ప్యారిస్‌ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్

‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారం కానుంది. తాజాగా ఈ విషయాన్నీ నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. “మీ వ్యాఖ్యలకు ఎట్టకేలకు సమాధానం ఇవ్వబడింది! రాధే శ్యామ్ (హిందీ) మే 4వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌కు వస్తోంది” అంటూ హిందీ ఓటిటి రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.