Site icon NTV Telugu

టీజర్ : సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ “నెట్”

NET Official Teaser Out Now

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లు సినిమాలకు ఓటిటిలో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఇదే జోనర్ లో తెరకెక్కుతున్న ఓటిటి ఫిలిం “నెట్”. ఇందులో రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలలో కనిపిస్తారు. తాజాగా విడుదలైన “నెట్” టీజర్ ఆసక్తికరంగా సాగింది. ప్లాట్‌లోకి ప్రవేశించిన లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) రహస్య కెమెరాల ద్వారా ప్రియ (అవికా గోర్)ను చూడటానికి ఆన్‌లైన్ నిఘా ఏజెన్సీలో నమోదు చేసుకుంటాడు. ప్రియ వ్యక్తిగత జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఈ పరిస్థితులు లక్ష్మణ్ ను ఆందోళనలో పడినట్టుగా టీజర్ లో కన్పిస్తోంది.

Read Also : సత్యదేవ్ కి జోడీగా నయన్

లక్ష్మణ్ ప్రియను రహస్యంగా ఎందుకు చూస్తాడు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. భార్గవ్ మాచర్ల రచన, దర్శకత్వం వహించగా, నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. “నెట్” సెప్టెంబర్ 10 న జీ 5లో ప్రీమియర్ కానుంది.

Exit mobile version