Site icon NTV Telugu

Bellamkonda Ganesh: ‘స్వాతిముత్యం’ హీరో రెండో సినిమా ఎప్పుడంటే…

Ganesh

Ganesh

Nenu Student Sir: ‘స్వాతిముత్యం’తో హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ గణేశ్‌ నటించిన రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సార్’! ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ‘నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. ‘నేను స్టూడెంట్ సార్!’ మూవీ మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. ప్రధాన తారాగణం సీరియస్ లుక్ లో ఉన్న పోస్టర్ ద్వారా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బెల్లంకొండ గణేష్ కు జోడిగా నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని కథానాయికగా నటిస్తుండగా, సముతిర ఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. అనిత్ మాదాడి సినిమాటోగ్రాఫర్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, కళ్యాణ్ చక్రవర్తి సంభాషణల రచయితగా పనిచేస్తున్నారు.

Exit mobile version