Site icon NTV Telugu

Kiran Abbavaram: వారం వెనక్కి వెళ్ళిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’

Kiran Abbavaram

Kiran Abbavaram

 

యువకథానాయకుడు కిరణ్‌ అబ్బవరం ప్రస్తుతం ఓ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న ఐదారు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. శతాధిక చిత్రాల దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి తొలిసారి నిర్మాతగా మారి కిరణ్ అబ్బవరంతో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ మూవీని నిర్మించింది.

ఈ సినిమాకు ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’ ఫేమ్ శ్రీధర్ గద్దె దర్శకత్వం వహించారు. సంజ‌న ఆనంద్‌, సిద్ధార్థ్ మీన‌న్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, సోను ఠాగూర్, భరత్ రొంగలి ఇందులో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 9వ తేదీ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అనివార్య కారణాలతో దీనిని ఇప్పుడు వారం పాటు పోస్ట్ పోన్ చేసి, సెప్టెంబర్ 16న విడుదల చేయబోతున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే విశ్వాసాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version