Site icon NTV Telugu

“నేనే నా” అంటున్న రెజీనా… మిస్టరీని ఛేదిస్తుందా?

NeNeNaa, Regina Cassandra, vennela kishore, Akshara Gowda, NeNeNaa Movie, NeNeNaa Movie Updates,

“నిను వీడని నీడను నేనే” అనే సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ తో తెరంగేట్రం చేశాడు దర్శకుడు కార్తీక్ రాజు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీని సస్పెన్స్ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. “నేనే నా” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెన్నెల కిషోర్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. శామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి గోకుల్ బెనాయ్ అందిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ తాజాగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Read Also : తగ్గేదే లే… దుమ్ము దులుపుతున్న “దాక్కో దాక్కో మేక” సాంగ్

ఇందులో రెజీనా ఒక మిస్టరీని ఛేదించడానికి తన అన్వేషణను ప్రారంభించినట్లు కన్పిస్తోంది. కళ్ళజోడు ధరించిన రెజీనా ధైర్యంగా అస్థిపంజరాన్ని పరిశీలిస్తున్నట్టు కనిపిస్తోంది. అక్కడ రెజీనాతో పాటు మరి కొందరు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఉండడం పోస్టర్‌లో చూడవచ్చు. సంచలన విజయం సాధించిన “జోంబీ రెడ్డి” తర్వాత యాపిల్ ట్రీ స్టూడియోస్‌ నిర్మిస్తున్న రెండవ చిత్రం “నేనే నా”. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది.

Exit mobile version