Jailer 2: ‘జైలర్ 2’ ప్రకటించిన డైరెక్టర్.. రజినీ- విజయ్ కాంబోలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా హీరోయిన్లుగా నటించగా.. మోహన్ లాల్, శివన్న క్యామియో రోల్స్ లో నటించారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. బీస్ట్ లాంటి పరాజయాన్ని అందుకున్నాక నెల్సన్ పై పెద్దగా అంచనాలు లేవు.. ఇంకోపక్క రజినీ సైతం ప్లాప్ ల్లో ఉన్నాడు. వీరి కాంబో నుంచి వచ్చిన చిత్రం.. ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు భయపడ్డారు. కానీ, మొదటి షో రిజల్ట్ రాగానే ఫ్యాన్స్ థియేటర్ లో రచ్చ చేయడం మొదలుపెట్టారు. రజినీ స్వాగ్, స్టైల్ వేరే లెవెల్ అయితే.. ఆయనకు ఇచ్చిన ఎలివేషన్స్.. అనిరుధ్ కొట్టిన బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక బీస్ట్ తరువాత ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడిన నెల్సన్.. ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు.
Miss Shetty and Mr Polishetty: అనుష్క వర్సెస్ నయన్.. లేడీ సూపర్ స్టార్లు ఇద్దరికీ పడిందే
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నెల్సన్.. జైలర్ సీక్వెల్ ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. ” జైలర్ పార్ట్ 2 కు ప్లాన్ చేస్తున్నా.. జైలర్ మాత్రమే కాదు నేను డైరెక్ట్ చేసిన కొలమావు కోకిల, డాక్టర్, బీస్ట్ సినిమాలకు కూడా పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నా.. వీటితో పాటు జైలర్ కూడా పార్ట్ 2 ఉంటుంది. ఈసారి ఈ కథలు అంతకు మించి ఉంటాయి అని చెప్పాడు. అంతే కాకుండా రజినీకాంత్- విజయ్ ల కాంబో లో ఒక సినిమా చేయాలని నా కోరిక. అది త్వరలోనే నెరవేరాలని కోరుకుంటున్నా” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు జైలర్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామని కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!