NTV Telugu Site icon

Neha Shetty: అర్థరాత్రి నడిరోడ్డుపై.. ఇలా రెచ్చగొట్టొచ్చా రాధికా

Neha

Neha

Neha Shetty: పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది నేహా శెట్టి. ఇక డీజే టిల్లులో రాధికగా మారి.. ప్రతి ఒక్కరి హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోతుంది అనుకున్నారు అందరు. కానీ, రాధిక గా మారిపోయినా నేహా మాత్రం అక్కడే ఆగిపోయింది. ప్రస్తుతం కార్తికేయ సరసన బెదురులంక సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు అస్సలు హద్దే లేకుండా పోతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో చిన్నది .. కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వెకేషన్ మోడ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడే చీరకట్టులో తళుక్కున మెరిసింది. అర్ధరాత్రి నడిరోడ్డుపై.. స్లీవ్ లెస్ బ్లౌజ్ పై చీరతో అదరగొట్టింది.

Chiranjeevi: ఏందన్నా.. మళ్లీ రీమేకేనా.. ఎందుకే మాపై నీకు అంత కోపం..?

హెయిర్ స్టైల్ చేంజ్ చేయడంతో నేహా సరికొత్తగా కనిపిస్తుంది. ఇక ఎప్పటిలానే ఎద అందాలను మాత్రం ఆరబోయకుండా వదలలేదు. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాలను ఘాటుగానే ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా నేహాకు ఆశించిన స్టార్ డమ్ మాత్రం అందడం లేదు. ఎంత చూపించినా కూడా అవకాశాలు దక్కడం లేదు. ఇక అమ్మడి ఆశలన్నీ బెదురులంక పైనే పెట్టుకుంది. ఈ సినిమా ఏమైనా మంచి పేరు అందుకుంటే తప్ప నేహా.. మరిన్ని అవకాశాలను అందుకోవడానికి ఛాన్స్ లేదు. మరి ఈ చిత్రం అమ్మడికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

Show comments