Site icon NTV Telugu

Neha Sharma: లిక్కర్ కన్నా ‘చిరుత’ భామే కిక్కెక్కిస్తోందట..

Neha

Neha

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు ఒక పక్క సినిమాలతో మరోపక్క యాడ్స్ తో బిజీగా మారుతున్నారు. ఇక ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇక ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సోషల్ మీడియా వేదికగా ఆల్కహాల్ బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెల్సిందే. సమంత దగ్గరనుంచి ప్రగ్యా జైస్వాల్ వరకు చాలామంది హీరోయిన్లు విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇక తాజాగా వారి లిస్ట్ లో జాయిన్ అయ్యింది చిరుత భామ నేహా శర్మ. తాజాగా అమ్మడు టోకి బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యింది. ది హౌస్ ఆఫ్ సుంటోరీ విస్కీ ని తాగమని నేహా ప్రచారం చేస్తోంది. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని చెప్తూనే తగినంత తాగడం ఆరోగ్యమని సెలవిస్తోంది.

ఇకపోతే టోకి విస్కీ బ్రాండ్ తో అమ్మడు ఇచ్చిన ఫోజు ప్రస్తుతం  హాట్ టాపిక్ గా మారింది. విస్కీ బాటిల్ ముందేసుకుని.. పూల పూల డిజైనర్ డ్రెస్ లో ఫోజు ఇచ్చిన ముద్దుగుమ్మ ఎద అందాలను ఎలివేట్ చేయడం మాత్రం మానలేదు. పాల నురగలాంటి దేహంపై నల్లటి డ్రెస్ లోనుంచి ఎద అందాలు ఎంతో అందంగా కనిపించాయి. ఇక దీంతో నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. లిక్కర్ కన్నా  అమ్మడి అందాలే కిక్కెక్కిస్తున్నాయని కొందరు.. లిక్కర్ లో ఏముంది మత్తు.. నేహా అందాలను చూస్తుంటే ఇంకా మత్తు ఎక్కుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Exit mobile version