NTV Telugu Site icon

Neeru Bajwa: అతడు నా సోదరి ఫ్రెండ్.. అతని వల్లే ఇలా అయ్యా

Neeru Bajwa On Marriage

Neeru Bajwa On Marriage

Neeru Bajwa Talks About Her Love Marriage: సెలెబ్రిటీల ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే! తమకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, కెరీర్ మీదే దృష్టి పెట్టామంటూ కథలు అల్లేస్తారు. మరికొందరైతే.. తమకు అసలు పెళ్లంటేనే ఇష్టం ఉండదని, ఎప్పటికీ పెళ్లి చేసుకోమని చెప్తుంటారు. ఇలా పెళ్లిన వాళ్లలో చాలామంది.. ఆ వెంటనే పెళ్లిపీటలు ఎక్కిన సందర్భాలున్నాయి. అనుకోకుండా గుండెలో గంట కొట్టడం వల్ల.. ఇలా పెళ్లి చేసుకున్నామని వాళ్లు చెప్తుంటారు. ఇప్పుడు నటి, దర్శకనిర్మాత నీరూ బాజ్వా కూడా అదే రిపీట్ చేసింది. జీవితంలో పెళ్లే చేసుకోడదనుకున్నా తాను, ఒక వ్యక్తిని చూడగానే ప్రేమలో పడిపోయి, అతడ్ని పెళ్లి చేసుకున్నానని చెప్పింది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పిటిషన్లపై విచారణ.. సౌత్ గ్రూప్ పైనే ప్రధాన ఆరోపణలు

‘‘నాకు పెళ్లి కాకముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే.. వెంటనే ముఖం తిప్పుకునేదాన్ని. ఎందుకంటే.. నేనంత రొమాంటిక్ కాదు. నాలో పెద్దగా ఫీలింగ్స్ ఉండేవి కావు. చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ, జీవితాన్ని గడిపేదాన్ని. అందుకే.. జీవితంలో పెళ్లి చేసుకోకుండా, ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ.. మనకు సరైన వ్యక్తి ఎదురైనప్పుడు గుండెలో గంటలు మోగడం, ప్రకృతి స్థంభించిపోవడం వంటివి జరుగుతాయంటారు కదా! నాక్కూడా సరిగ్గా అలాగే.. హ్యారీని చూసినప్పుడు అనిపించింది. మొదటి చూపులోనే నేను అతనికి పడిపోయా. నేను పెళ్లాడబోయేది అతడినే అని అప్పుడే ఫిక్సయ్యా కూడా! హ్యారీ నా సోదరికి స్నేహితుడు కావడంతో.. నేను అతనికి దగ్గరవ్వగలిగాను. పెళ్లి కూడా ఈజీగానే జరిగిపోయింది. పెళ్లయ్యాక.. నేను మరింత సక్సెస్‌ఫుల్‌ అయ్యానని అనిపిస్తోంది’’ అంటూ నీరూ చెప్పుకొచ్చింది.

Pathan Movie: పఠాన్ టికెట్ ఇప్పించండి, లేదంటే చచ్చిపోతా.. ఫ్యాన్‌పై ఎటాక్

కాగా.. 1998లో ‘‘మై సోలా బరస్‌‌కి’ అనే సినిమాతో నీరూ తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో తనకు మంచి గుర్తింపు రావడంతో.. వెనువెంటనే అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగే.. అస్తిత్వ, ఏక్‌ ప్రేమ్‌ కహానీ, జీత్‌, గన్స్‌ అండ్‌ రోజెస్‌ సీరియల్స్‌తో బుల్లితెరపై కూడా సందడి చేసింది. అంతేకాదు.. షాదీ లవ్‌ స్టోరీ, జట్‌ అండ్‌ జూలియట్‌ 2, నాటీ జట్టాస్‌ అనే పంజాబీ సినిమాల్లోనూ నటించింది.

Show comments