కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం “ఆచార్య”. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సోషల్ మెసేజ్ డ్రామాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజాహెగ్డే రొమాన్స్ హైలెట్ కానుంది. ఈ మేరకు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లలో నీలాంబరి పాత్రలో పూజాహెగ్డే ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. తాజాగా రామ్ చరణ్, పూజాహెగ్డే లపై రూపొందించిన “నీలాంబరి” సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. మెగా ఫ్యాన్స్ కోసం దీపావళి కానుకగా ఈ ప్రోమోను విడుదల చేయగా, నవంబర్ 5న పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
Read Also : “పెద్దన్న” ట్విట్టర్ రివ్యూ
