Site icon NTV Telugu

Nee Valane: ఆసక్తికరంగా ‘కలియుగం పట్టణంలో’ ‘నీ వలనే’ సాంగ్

Nee Valane' Song

Nee Valane' Song

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘కలియుగం పట్టణంలో’ రిలీజ్ కి రెడీ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలు రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. ఈ సినిమాను డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతున్న ఈ మూవీలో చిత్ర శుక్లా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పెంచారు. ఈక్రమంలోనే చిత్రం నుంచి మంచి మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నీ వల్లే’ అంటూ సాగే ఈ మెలోడి పాటను ఎం.ఎం.మానసి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ అరసాడ అందించిన చక్కటి బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 22న భారీ ఎత్తున విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చంద్రబోస్, భాస్కర భట్ల సాహిత్యం అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

Exit mobile version