Site icon NTV Telugu

‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు

NCB raids Ananya Pandey's Bandra house

బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గత 14 రోజుల నుండి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. నిన్న కోర్టులో విచారణకు వచ్చిన ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. అయితే తాజాగా ఎన్సీబీ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇంటిపై దాడులు చేయడం ఆసక్తికరంగా మారింది. నటుడు చుంకి పాండే కూతురు, అనన్య పాండే బాంద్రాలో నివాసం ఉంటున్న ఇంటిపై నార్కోటిక్స్ బ్యూరో కంట్రోల్ (ఎన్‌సిబి) గురువారం దాడి చేసింది. సమాచారం ప్రకారం డ్రగ్స్ కేసులో విచారణకు ఈ రోజు ఎన్సీబీ ఎదుట హాజరు కావాలని సమన్లు ​​జారీ చేశారు అధికారులు. అయితే దాడుల అనంతరం ఎన్సీబీ ఆమె ఇంట్లో ఏం స్వాధీనం చేసుకున్నారు ? అనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.

Read Also : ఫుల్లీ అండ్ మళ్ళీ లోడెడ్… తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్

నిన్న ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ సమయంలో అతన తన ఫ్రెండ్స్ తో డ్రగ్స్ కు సంబంధించి ఆయన చేసిన వాట్సాప్ చాట్స్ ను కోర్టుకు సమర్పించింది. అందులో ఒక నటి పేరు కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఆ నటి ఎవరన్న విషయాన్ని ఎన్సీబీ స్పష్టం చేయలేదు. కానీ ఈ విషయాన్ని వెల్లడించిన మరునాడే అనన్య పాండే ఇంటిపై దాడులు నిర్వహించడం గమనార్హం. ఇక ఈ డ్రగ్స్ నిరోధక ఏజెన్సీ ముంబైలోని షారూఖ్ ఖాన్ ఇల్లు మన్నత్‌పై కూడా దాడి చేసింది.

Exit mobile version