నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్‌నే ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు.
Also Read : K Ramp : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్‌డేట్..!
అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్‌లో బాలయ్యపై భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ఒక మాస్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారని టాక్. ఈ పాటలో బాలయ్య స్టైల్, పవర్‌ఫుల్ ఆట్టిట్యూడ్ ని హైలైట్ చేసేలా కాన్సెప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే, ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య పాత్రను మాఫియా నేపథ్యంతో చూపించబోతున్నారని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. అంటే బాలయ్య లుక్, గెట్‌అప్ కూడా పూర్తిగా కొత్తగా, స్టైలిష్‌గా ఉండనుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాపై గోపీచంద్ మలినేని ఇటీవల ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ ..“గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్! ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది. బాలయ్య గారితో మరోసారి వర్క్ చేయడం గర్వంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుంది” అని చెప్పాడు. దీంతో ఇప్పటికే ‘NBK111’ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బాలయ్య ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య – గోపీచంద్ కాంబో నుంచి మరో సెన్సేషనల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి, ‘NBK111’ షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలయ్య మాస్ గర్జన మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.
