Site icon NTV Telugu

NBK107 :బాలయ్య వెనక్కి తగ్గారా..!

nbk 107

nbk 107

 

‘అఖండ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహాం బాలకృష్ణ.. అదే ఊపులో అభిమానులకు మరో హిట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమా షూటింగ్.. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణ పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారట రామ్-లక్ష్మణ్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. ఇక ఈ సినిమా NBK107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇటీవలె రిలీజ్ అయిన ఫస్ట్ హంట్ టీజర్.. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. దాంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు.

ఈ నేపథ్యంలో ఎన్బీకే 107 రిలీజ్ డేట్ గురించి రోజుకో వార్త వినిపిస్తోంది. ఇంతకుముందు బాలయ్య దసరా రేసులో రావడానికి రెడీ అవుతున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు మరింత లేట్‌గా రాబోతున్నట్టు తెలుస్తోంది. దసరాకు ఇంకొన్నిపెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అంతేకాదు.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త టైం పట్టేలా ఉందట. దాంతో ఈ సినిమా ఇయర్ ఎండింగ్‌లో రాబోతోందని తెలుస్తోంది. అంతేకాదు రిలీజ్‌ డేట్ కూడా లాక్ చేశారని టాక్. అందులోభాగంగా.. ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన అఖండ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాను కూడా డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. దాంతో బాలయ్య ఫ్యాన్స్ మరీ అంత లేటా.. అని అంటున్నారు. అయితే బాలయ్య ఎప్పుడైనా బరిలోకి దిగొచ్చనే టాక్ కూడా ఉంది. కాబట్టి NBK107 రిలీజ్ ఎప్పుడనేది తెలియాలంటే.. అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version