NTV Telugu Site icon

Veera Simha Reddy: పంచెకట్టులో నట సింహం గ్రాండ్ ఎంట్రీ

Nbk

Nbk

Veera Simha Reddy: నందమూరి నట సింహం ఒంగోలులో అడుగుపెట్టింది. ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతున్న విషయం విదితమే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు మొత్తం జై బాలయ్య స్లొగన్స్ తో దద్దరిల్లిపోయింది.

ఇక సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఈవెంట్ లో తాజాగా బాలయ్య గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. వీర సింహారెడ్డి పాత్రకు తగ్గట్టే బాలయ్య పంచెకట్టుతో వచ్చిన తీరు అందరిని ఆకట్టుకొంటుంది. వైట్ టీ షర్ట్ పై గోల్డ్ బ్లేజర్ తో బ్లాక్ పంచె కట్టుకొని ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక బాలయ్య ఒక్కసారిగా స్టేజిమీదకు రావడంతో జై బాలయ్య అరుపులతో స్టేజి దద్దరిల్లింది. అభిమానులకు వందనం చేసి బాలయ్య చిత్ర బృందంతో కలిసి కూర్చున్నారు.