NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్

Nbk111

Nbk111

వీరసింహారెడ్డి’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్లాన్ చేసింది. కానీ ఈ డేట్ ను అందుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోందని టాక్.

షూటింగ్ పరంగా ఇంకా భారీ వర్క్ బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఇంకా దాదాపు 45 రోజుల షూటింగ్ మిగిలి ఉందట. అక్టోబర్ నాటికి సినిమాను సిద్ధం చేయాలంటే పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులతో కలిపి టైమ్ చాలా తక్కువగా ఉంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని భావిస్తున్న దర్శకుడు గోపీచంద్ షూటింగ్ షెడ్యూల్స్ విషయంలో కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు. దీంతో దసరా రేస్ నుండి ఈ సినిమా తప్పుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రత్యామ్నాయ విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి చిత్ర యూనిట్ చూపు డిసెంబర్ 4 రిలీజ్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా పనులు పూర్తి కాకపోతే బాలయ్యకు బాగా కలిసి వచ్చిన సీజన్ అయిన సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే వచ్చి ఘనవిజయం సాధించడంతో  ఆ డేట్ ను కూడా చూస్తున్నారు. కానీ ఎప్పుడు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇన్ సైడ్ టాక్.