Site icon NTV Telugu

Nayanthara : విడుదలైన నయన్ ‘O2’ టీజర్

Nayana

Nayana

సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ ఇటీవల కాలంలో వరుసగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇటీవల ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన నయన్ తాజాగా ‘O2’ అనే సినిమాతో రానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్న ఈ సినిమాకు విఘ్నేష్ దర్శకుడు. డిస్నీ+ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. ప్రమాదంలో మిస్ అయిన ఓ బస్సులో ప్రయాణీకులు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతుంటారు. మరి మిస్ అయిన ఆ బస్సు ని కనిపెట్టగలిగారా? ప్రయాణీకులలో ఉన్న నయనతార ఏం చేసింది? ఇదే సినిమా కథాంశం. నిజానికి ముందు ఈ సినిమాకు ‘ఆక్సిజన్’ అనే టైటిల్ అనుకున్నా… ఇంగ్లీష్ పదాలతో అయితే ఈజీగా ఆడియన్స్ కి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో ‘O2’ అని పెట్టారు. ఇంతకు ముందు కూడా నయన్ నటించిన ‘నేత్రికన్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీహాట్‌ స్టార్‌ లో డైరెక్ట్ గా విడుదలయింది. అది తెలుగులో ‘త్రినేత్ర’ పేరుతో అనువాదం అయింది. ఇప్పుడు ఈ ‘O2’ ను కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ పలు భాషల్లో ఓకే సారి ఈ సినిమా విడుదల కానుంది. టీజర్ తో ఆకట్టుకున్న నయన్ సినిమాతో ఎంతగా మురిపిస్తుందో చూడాలి.

 

Exit mobile version