NTV Telugu Site icon

Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?

Nayan

Nayan

Nayanthara: పెళ్లి తర్వాత నయన్ జోరు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించి షాక్ ఇస్తోంది. పెళ్ళికి ముందే నయన్.. షారుక్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇది కాకుండా భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అమ్మడే హీరోయిన్. అంతకుముందు అజిత్ తో అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ తో ఉంటుంది అంటున్నారు. ఈ రెండు సినిమాలు ఇంకా పూర్తికాకముందే లేడీ సూపర్ స్టార్ మరో సినిమాను ప్రకటించేసింది. నయనతార, సిద్దార్థ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో ఎస్. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం టెస్ట్.

Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?

వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందని మేకర్స్ అధికారికంగా తెలుపుతూ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సిద్దార్థ్, మాధవన్, నయన్ .. ముగ్గురు సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఫోటోలపై టెస్ట్ టైటిల్ ను డిజైన్ చేశారు. అయితే పోస్టర్ ను చూస్తుంటే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుందని చెప్పొచ్చు. మొదటి నుంచి నయన్ అందులో ఆరితేరి ఉందన్న విషయం తతెల్సిందే. మరి ఈ చిత్రంలో ఈ ఇద్దరి హీరోలకు నయన్ ఎలాంటి టెస్ట్ పెట్టనుంది..? వారు పాస్ అయ్యారా..? లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.