Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మూవీ అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హైప్ పెంచేస్తున్నారు. ప్రతి అనౌన్స్ మెంట్ ఒక ప్రమోషన్ లాగా చేసేస్తున్నారు. అందుకే మూవీ ట్రెండింగ్ లో ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి ఓ కామెడీ జానర్ సినిమా చేస్తున్నారు. అందుకే మూవీపై అంచనాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా చేస్తోంది.
Read Also : The Rajasaab : ఇద్దరు హీరోయిన్లు కావాలన్న ప్రభాస్.. ముగ్గురిని దించిన మారుతి..
గాడ్ ఫాదర్, సైరా నర్సింహారెడ్డి తర్వాత చిరుతో ఆమె నటిస్తున్న మూవీ ఇది. ఆమె అనౌన్స్ మెంట్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. నాయన తార రేపటి నుంచే షూటింగ్ లో జాయిన్ కాబోతోంది. ప్రస్తుతం ముస్సోరిలో షూట్ జరుగుతోంది. రెండు రోజుల పాటు ఇక్కడ నయన్ షూట్ లో పాల్గొంటారు.
ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట. అక్కడే మూవీలో ఇంపార్టెంట్ సీన్లు తీయబోతున్నారని సమాచారం. చిరంజీవి ఓ వైపు విశ్వంభర తీస్తూనే ఇంకోవైపు అనిల్ మూవీ కోసం భారీగా డేట్స్ ఇచ్చేస్తున్నారు.
Read Also : Kannappa Vs Kubera : కన్నప్ప వర్సెస్ కుబేర.. ఏ ట్రైలర్ బాగుందంటే..?
