Site icon NTV Telugu

Nayanthara: పెళ్లి తరువాత నయన్ మొదటి హిట్ కొట్టేనా..?

Nayan

Nayan

Nayanthara: సాధారణంగా ఎవరి జీవితంలోనైనా పెళ్లి తరువాత కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలోని తారలకు పెళ్లి తరువాత హిట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ట్రోలర్స్ హిట్ అయితే వారిని, ప్లాప్ అయితే వారి భాగస్వామ్యులను టార్గెట్ చ్చేస్తూ ఉంటారు. ఇలాంటి ట్రోల్స్ చాలామంది జీవితాల్లో జరిగాయి. ఇక ప్రస్తుతం అందరి చూపు కొత్త పెళ్లి కూతురు నయనతార పైనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ లో నయన్, ప్రియుడు విగ్నేష్ ను వివాహమాడింది. కొత్త జంట హనీమూన్ ను ముగించుకొని ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు ఫ్యాకస్ పెడుతున్నారు. ఇక నయన్ పెళ్లి తరువాత వచ్చిన చిత్రం ఓ2. అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కాలేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి యావరేజ్ గా నిలిచింది. ఇక దీన్ని పక్కన పెడితే నయన్ పెళ్లి తర్వాత థియేటర్ లో రిలీజ్ కాబోతున్న సినిమా గాడ్ ఫాదర్.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 5 న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా నయన్ కనిపించబోతోంది. ఒక రాజకీయ నాయకురాలి కూతురిగా, ఒక బిజినెస్ మ్యాన్ కు భార్యగా పవర్ రోల్ లో కనిపిస్తోంది. ఇప్పటికే టీజర్ లో నయన్ లుక్ అదిరిపోయింది. ఇక తాజాగా నయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సత్యప్రియ జై దేవ్ గా నయన్ ఇందులో కనిపించబోతోంది. ఎంతో హుందాగా చారల చీరలో సీరియస్ లుక్ లో నయన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరు ఇటీవలే ఆచార్య ప్లాప్ తో నిరాశలో ఉన్నారు. మరి ఈ సినిమాకు నయన్ లక్ ఏమైనా తోడవుతుందా..? పెళ్లి తరువాత నయన్ కు హిట్ అందుతుందా..? లేక ప్లాప్ మిగులుతుందా..? అనేది చూడాలంటున్నారు ప్రేక్షకులు.

Exit mobile version