Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nayanthara Completes 22 Years In Cinema Every Shot Changed My Life

Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది

Published Date :October 9, 2025 , 12:42 pm
By Mounika
Nayanthara : 22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
  • Follow Us :
  • google news
  • dailyhunt

దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్‌”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా ప్రపంచమవుతాయని అప్పటికి తెలియదు. ప్రతి షాట్‌, ప్రతి ఫ్రేమ్‌, ప్రతి మౌనం నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి, నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి” అంటూ ఆమె రాసిన మాటలు అభిమానుల మనసులు హత్తుకుంటున్నాయి.

Also Read : ‘Dude’ Trailer : ప్రదీప్ ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడే

2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన నయనతార, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘చంద్రముఖి’ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత వరుస హిట్స్‌తో దక్షిణాది తెరపై తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు, సీరియస్ రోల్స్, హారర్ కథలు, ఫ్యామిలీ డ్రామాలు ఇలా.. ఏ జానర్ అయినా నయనతారకు న్యాయం చేయగలదనే నమ్మకం ప్రేక్షకులలో ఏర్పడింది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఆమె ప్రత్యేకత.

ఇటీవల ‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నయనతారకు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. 22 ఏళ్ల సినీ ప్రయాణంలో నయనతార సాధించిన విజయాలు, తాను చూపిన కట్టుబాటు, మహిళా నటీమణులు కోసం సృష్టించిన కొత్త మార్గం ఇవన్నీ ఆమెను నిజమైన “లేడీ సూపర్‌స్టార్‌”గా నిలబెట్టాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • lady superstar Nayanthara
  • Man Shankara Varaprasad Garu
  • Nayanthara 22 years in cinema
  • Nayanthara career milestone
  • Nayanthara Chiranjeevi movie

తాజావార్తలు

  • Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..

  • Inter Result: అంతులేని విషాదం.. ఇంటర్ ఫలితాలు విడుదల.. ప్రాణాలతో లేని ‘టాపర్’

  • Mogdi Honhaga: “మావోయిస్టు క్యాంపులో నన్ను శారీరకంగా వేధించారు”.. లొంగిపోయిన 19 ఏళ్ల మహిళా నక్సలైట్ ఆవేదన..

  • Ramayana: రామాయణ టీజర్ పై కొత్త అప్‌డేట్..!

  • BJP: రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి, భారీగా ఉపాధి అవకాశాలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్..

ట్రెండింగ్‌

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions