Site icon NTV Telugu

Nayanthara: పెళ్లి తరువాత మొదటి హిట్.. ఎమోషనల్ అయిన లేడీ సూపర్ స్టార్

Nayan

Nayan

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహమాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారారు. పెళ్లి తరువాత నయన్ నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక పెళ్లి తరువాత మొట్ట మొదటి విజయాన్ని నయన్ తన ఖాతాలో వేసుకొంది. ఇక తమకు భారీ విజయం అందించిన ప్రేక్షకులకు నయన్ కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసింది.

“బ్లాక్ బస్టర్. మీరందరూ థియేటర్‌లో మీ ఆత్మీయులతో కలిసి మా చిత్రాన్ని చూస్తుండడం చాలా ఆనందంగా ఉంది. గాడ్ ఫాదర్ నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం.. ఎందుకంటే ఇందులో పాల్గొన్న వ్యక్తులు మరియు దాని వెనుక ఉన్న అద్భుతమైన బృందం. మెగాస్టార్ చిరంజీవి గారితో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అతను ఒక గొప్ప వ్యక్తి.. నటన లో పవర్ హౌస్. అతనితో సెట్‌లో ఉన్న ప్రతి క్షణం నేను ఎంతో ఎంజాయ్ చేశాను.. ఎంతో నేర్చుకున్నాను. సైరా తరువాత మరోసారి చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవం ఆనందంగా ఉంది. చిరంజీవి గారూ ధన్యవాదాలు. నన్ను నిరంతరం విశ్వసిస్తున్న దర్శకుడు మోహన్ రాజా గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘సత్య ప్రియ’ లాంటి పవర్ ఫుల్ పాత్రలో నేను బాగా చేస్తాను అని నమ్మి నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు. సల్మాన్‌ఖాన్‌ని అందరూ ఎందుకు ప్రేమిస్తారో ఈ సినిమా తెలియజేస్తుంది.. ఆయన రాకతో ఈ చిత్రానికి మరింత భారీతనం వచ్చింది. నాతోటి నటీనటులకు, నా పాత్ర బాగా రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, నా చెల్లి తాన్యాకు సత్యదేవ్‌ కు ధన్యవాదాలు. ఏ ఆర్టిస్ట్‌కైనా, సాంకేతిక నిపుణుడికైనా ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ డ్రీమ్స్‌ ప్రొడ్యూసర్స్‌. పండుగ సీజన్‌ పెద్ద హిట్‌ ఇచ్చిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు చెబుతున్నా”అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version