Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం తెలుగులో నయన్ నటించిన గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే నయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ కు చెల్లెలిగా నయన్ కనిపించనుంది. నయన్ పెళ్లి తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇది. అయితే ఈ సినిమా కోసం నయన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నదట.
శ్రీరామ రాజ్యం సినిమా తరువాత నయన్ ప్రమోషన్స్ కు రావడం మానేసిన విషయం విదితమే. ఇక ఈ సినిమా కోసం అమ్మడు ప్రమోషన్స్ కు రానున్నదట. పెళ్లి తరువాత ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను నయన్ కలిసింది లేదు. ఇక ఈ సినిమా వలన అది నెరవేరుతుందని నయన్ ఈ నిర్ణయం తీసుకున్నదట. త్వరలోనే నిర్వహించబోయే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భర్తతో సహా అటెంట్ కావాలని చూస్తున్నదట నయన్. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ వస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈ మధ్యకాలంలో వచ్చే బిగ్గెస్ట్ ఈవెంట్ ఇదే అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి నయన్ ఈ ఒక్క సినిమాకు మాత్రమే ప్రమోషన్స్ చేస్తుందా..? ఇక నుంచి అన్ని సినిమాలకు ఇదే కంటిన్యూ చేస్తుందా..? అనేది చూడాలి.
