Site icon NTV Telugu

అత్తగారింట్లో విఘ్నేశ్ శివన్

లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో వున్న విషయం తెలిసిందే.. ఈమధ్య కాలంలో పబ్లిక్ లో బాహాటంగానే తిరుగుతున్నారు. త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, విఘ్నేశ్ శివన్ తన ప్రియురాలు నయన్ ఇంట్లో ప్రత్యేక్షమైయ్యాడు. నయన్ తల్లి ఓమన కురియన్ పుట్టిన రోజు సందర్బంగా విఘ్నేశ్ ఆమె ఇంటికి విచ్చేశారు. చెన్నై నుండి వీరిద్దరూ కలిసి కేరళ వెళ్లారు. అక్కడ సరదాగా అమ్మ బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కాగా.. త్వరలోనే పెళ్లికి సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version