Site icon NTV Telugu

మొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న నయన్, విగ్నేష్

Nayanthara and Vignesh Shivan receive first international award

దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం ఈ లవ్ బర్డ్స్ తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న తమిళ చిత్రం “కూజంగల్” నిర్మాణ, పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్‌”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దర్శకుడి కుటుంబంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించబడింది.

Read Also : ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?

ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ నిన్న సోషల్ మీడియాలో నయనతార టైగర్ అవార్డును పట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలను పంచుకున్నారు. “మా మొదటి అంతర్జాతీయ పురస్కారం… “కూజంగల్” మాకు ప్రతిష్టాత్మక టైగర్ అవార్డును రోటర్‌డామ్ నుండి చెన్నైలో ఉన్న ఇంటికి తీసుకువచ్చింది. ఈ రత్నాన్ని తయారు చేసిన దర్శకుడు పిఎస్ వినోద్ రాజ్, చిత్రబృందానికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రశంసలు పొందడం మాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది!” అంటూ పోస్ట్ చేశారు. ఇక నయన్, విఘ్నేష్ ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్” సినిమా కోసం కలిసి పని చేస్తున్నారు.

Exit mobile version