NTV Telugu Site icon

Nayanthara: 50 సెకన్లకు రూ. 5 కోట్లు ఏంటీ పాప.. నమ్మేలా ఉందా అసలు.. ?

Nayan

Nayan

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తదుపరి సినిమాలను కూడా మంచి పాన్ ఇండియా సినిమాలనే లైన్లో పెట్టింది. ఇక పెళ్లి తరువాత నయన్ .. బిజినెస్ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మించి సినిమాలు చేస్తున్న నయన్.. గతేడాది 9 స్కిన్ అనే పేరుతో చర్మ సౌందర్య ఉత్పత్తులను ఆన్ లైన్ లో అమ్మడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తీ అయ్యాయి. ఇక ఈ మధ్యనే 9 స్కిన్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన యాడ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నయన్ లుక్ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఎంతో ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రతి స్కిన్ కు సరిపోయేలా తమ ప్రొడక్ట్స్ ను డిజైన్ చేశామని నయన్ చెప్పుకొచ్చింది. ఇక వీటితో పాటు నయన్.. యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తుందని తెలుస్తోంది. అమ్మడి రేంజ్ ను బట్టి.. యాడ్స్ రెమ్యూనిరేషన్ ఉంటుందంట.

Shalini Pandey: ప్రీతి.. ఏంటి ఈ అరాచకం.. అర్జున్ రెడ్డి ఏమైపోవాలి

ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఇటీవల ఈ భామ చేసిన యాడ్ కు అక్షరాలా రూ. 5 కోట్లు అందుకుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అది కూడా కేవలం 50 సెకన్స్ కనిపించినందుకు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం ఒక్క యాడ్ కోసం అమ్మడు ఇంత తీసుకుంటుందా.. ? అంటే నమ్మేలా ఉందా.. ? ఇదంతా ఫేక్ అయ్యి ఉంటుంది అని లైట్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది తీసుకున్నా తప్పు లేదు ఆమె మార్కెట్ అలాంటింది అని చెప్పుకొస్తున్నారు. మరి ముందు ముందు నయన్ ఇంకెంత రికార్డ్ రెమ్యూనిరేషన్ అందుకుంటుందో చూడాలి.

Show comments