దక్షిణాది సూపర్ స్టార్ నయనతార వివాహం ప్రియుడు విఘ్నేష్ శివన్ తో రేపు చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో జరగనుంది. గత ఐదేళ్ళుగా డేటింగ్ లోఉన్న ఈ జంట పెళ్ళి గురించి పలుమార్లు మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. అయితే ఎన్నో సార్లుగా వాయిదా పడుతూ వచ్చినప్పటికి ఈసారి మాత్రం ఈ జంట పెళ్ళి పీటలు ఎక్కనుంది.
నయన్, విఘ్నేష్ శివన్‌ల వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ‘దేవుడితో పాటు మా కుటుంబ పెద్దల ఆశీర్వాదంతో కురియన్ కోడియట్టు, శ్రీమతి ఓమన కురియన్ కుమార్తె నయనతార, కీ.శే శివకొలుందు, శ్రీమతి మీనాకుమారి కుమారుడు విఘ్నేష్ శివన్ వివాహ వేడుకకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. 9 జూన్ 2022 గురువారం, షెరటాన్ గ్రాండ్, మహాబలిపురం నందు జరగబోయే ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు. కొంతమంది సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. జాతి దుస్తులు ధరించి ఈ వేడుకలో హాజరుకావాలని ఆహ్వానపత్రికలో పేర్కొనటం విశేషం. ఇక పెళ్ళి తర్వాత జూన్ 11న కొత్త జంట మీడియాను కలవనున్నట్లు సమాచారం.
