Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nawazuddin Siddiqui: ఒక నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చేయడానికి ఒక్క సినిమా చాలు.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడికి ఒక్కసారిగా వరుస ఆఫర్లు రావడం, నిర్మాతలు కూడా పారితోషికం ఎంత కావాలంటే అంత రాసుకోమంటూ బ్లాంక్ చెక్కులు ఇవ్వడం అంటే మాటలు కాదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవితంలో అలాంటి మలుపు తీసుకొచ్చిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. ఈ సినిమా తనను తొలిసారి స్టార్‌గా భావించేలా చేసిందని నవాజుద్దీన్ తాజాగా గుర్తుచేసుకున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ రెండు భాగాలుగా 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రెండో భాగంలో ఫైజల్ ఖాన్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించారు. ఆ పాత్ర ఆయన కెరీర్‌కు ఎంత పెద్ద గుర్తింపు తీసుకొచ్చిందంటే, సినిమా విడుదలైన తర్వాత ఆయనకు వచ్చిన అవకాశాలు కూడా ఒక్క సారిగా పెరిగి పోయాయి.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ఏ సినిమా స్టార్‌గా భావించేలా చేసిందని అడగ్గా, ఎలాంటి సందేహం లేకుండా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’ అని నవాజుద్దీన్ చెప్పారు. ఆ సినిమా తర్వాత తన దగ్గరకు దాదాపు 200 స్క్రిప్టులు వచ్చాయని వెల్లడించారు. అంతేకాదు కొంతమంది నిర్మాతలు స్క్రిప్ట్‌తో పాటు బ్లాంక్ చెక్కులు కూడా తన టేబుల్‌పై పెట్టేవారని తెలిపారు. మీకు ఎంత పారితోషికం కావాలో మీరే రాసుకోండి, మీకు ఖాళీగా ఉన్న డేట్స్ చెప్పండి అంటూ ఆఫర్లు వచ్చేవని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే ఇంత పెద్ద అవకాశం ఒక్కసారిగా వచ్చినా నవాజుద్దీన్ మాత్రం ఆఫర్లకు తొందరపడలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి కథను అంగీకరించకుండా, తనకు నచ్చిన కథ, కంటెంట్ ఉన్న పాత్ర కోసం ఎదురుచూశారు. అప్పట్లో వచ్చిన చాలా స్క్రిప్టులు తనను అంతగా ఆకట్టుకోలేదని, అందుకే వాటికి సంతకం చేయకుండా ఉండిపోయానని ఆయన మరోసారి గుర్తు చేసుకున్నారు.
Also Read
‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’లో ఫైజల్ ఖాన్ పాత్రతో వచ్చిన క్రేజ్ నవాజుద్దీన్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ఆయన ‘ది లంచ్‌బాక్స్’, ‘మాంటో’, ‘మాంఝీ: ది మౌంటెన్ మ్యాన్’, ‘బడ్లాపూర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి విభిన్నమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏళ్ల తరబడి చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడి టేబుల్‌పై ఒక్కసారిగా 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు వచ్చిపడే స్థాయికి తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. కానీ ఆ తరువాత డబ్బుకోశం తొందరపడకుండా, సరైన కథ కోసం ఎదురుచూసిన తీరు మాత్రం నవాజుద్దీన్ కెరీర్లో మరో ముఖ్యమైన పాఠంగా నిలిచింది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?