Site icon NTV Telugu

Naveen Polishetty: “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం యూఎస్ కూడా.. నవీన్ పోలిశెట్టి ఎక్కడా తగ్గట్లేదుగా!

Miss Shetty Mr Polishetty Censor Review

Miss Shetty Mr Polishetty Censor Review

Naveen Polishetty to join Miss Shetty Mr Polishetty Standup tour in USA: తన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేసిన నవీన్ పోలిశెట్టి అందులో భాగంగా తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే తరహా ప్రమోషనల్ టూర్ కోసం ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పోలిశెట్టి.

Kushi: ఖుషి ఖుషిగా సమంత.. అమెరికాలో సరికొత్త రికార్డు!

అమెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి, ఈ క్రమంలో డల్లాస్ లో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇక డల్లాస్ షో అయిన తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో కూడా నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద దర్శకుడు పి.మహేశ్ బాబు రూపొందించారు. ఈ నెల 7న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోండగా యూఎస్ లో ప్రత్యాంగిర సినిమాస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.

Exit mobile version