‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా అడుగుపెట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ చిత్రంతో టాలీవుడ్ లో సత్తా ఉన్న కుర్ర హీరో అనిపించుకున్న నవీన్ ఆ తరువాత జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత నవీన్ పెద్ద బ్యానర్ లోనే పడ్డాడు. ఎప్పటినుంచో నవీన్ , అనుష్క శెట్టి జంటగా ఒక సినిమా రాబోతున్నదని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ సినిమాను మేకర్స్ మొదలుపెట్టినట్లు తెలిపారు. నేడు నవీన్ పోలిశెట్టి బర్త్ డే సందర్బంగా యూవీ క్రియేషన్స్ మేకర్స్ నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
నవీన్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ ప్రొడక్షన్ నెం. 14గా మహేశ్ బాబు పి దర్శకత్వంలో నవీన్ 3 వ చిత్రం, అనుష్క 48 వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనునట్లు తెలిపారు. ఇక పోస్టర్ లో నవీన్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇకపోతే ఈ సినిమాకు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
