Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్న ఈ హీరో ఇప్పుడు ఓ సంచలన దర్శకుడి సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మణిరత్నంలో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మణిరత్నం ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో ట్యాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకోవాలని చూస్తున్నాడంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది నిజమే అయితే నవీన్ కు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే.
Read Also : LSG vs SRH: ప్లేఆఫ్స్ కోసం పోరు.. గెలిస్తేనే నిలుస్తారు
దర్శకుడిగా మణిరత్నంకు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఎవర్ గ్రీన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. అలాంటి మణిరత్నం ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో సినిమా చేస్తే అది నవీన్ కెరీర్ లో మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీలో సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారంట. నటన పరంగా నవీన్, సాయిపల్లవికి తిరుగు లేదు. డైరెక్షన్ పరంగా మణిరత్నంకు ఎదురే లేదు. ఇలాంటి ట్యాలెంటెడ్ మేకర్స్ అందరూ కలిస్తే ఆ మూవీ మరో లెవల్లో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మణిరత్నం ఇప్పుడు కమల్ హాసన్ తో థగ్ లైఫ్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ కాంబో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Read Also : Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి..
