యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం అంతే లెవల్లో ప్లాన్ చేసారట మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభంగా జరగనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రోగ్రామ్ హోస్ట్ గా జాతి రత్నం హీరో నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడట.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ ఏజెంట్ ‘సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో హీరోగా పరిచయమై జాతి రత్నాలు చిత్రంతో స్టార్ హీరో రేంజ్ కి మారిపోయాడు. ‘జాతి రత్నాలు’ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ – నవీన్ ఎంతటి రచ్చ చేశారో అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కి నవీన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఇక నవీన్ కామెడీ పంచులు, చేసే అల్లరి, స్టేజి కింద హీరోలతో చెప్పించే ముచ్చట్లు అబ్బో.. ఒక్కసారిగా ఈ ఈవెంట్ హైప్ పెరిగిపోయింది. ఇక ఈ వేడుకకు ప్రభాస్ నటిస్తున్న తదుపరి సినిమాల దర్శకులందరూ హాజరు కానున్నారట. ఈ లెక్కన చూస్తే రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ మాములుగా ఉండదన్న విషయం అర్దమవుతుంది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ వేడుకను చూడాలి అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
