NTV Telugu Site icon

Eleven: నవీన్ చంద్ర హీరోగా బై లింగ్యువల్ ‘ఎలెవెన్’

Naveen Chandra New Movie

Naveen Chandra New Movie

Naveen Chandra Bilingual titled as ‘Eleven’: అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తరువాత కూడా పలు సినిమాలు హీరోగా చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ‘సిల నేరంగాలిల్ సిల మణిధర్‌గళ్’, ‘సెంబి’ లాంటి విజయవంతమైన చిత్రాలని అందించిన ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ నెంబర్3గా అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ని నిర్మించేందుకు సిద్దం అయ్యారు. ఈ ప్రాజెక్టుకు ‘ఎలెవెన్’ అనే ఒక టైటిల్ ని ఖారారు చేశారు. ఈ ‘ఎలెవెన్’ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ఘనంగా ప్రారంభమైంది. ‘కలకలప్పు 2’, ‘వంద రాజవతాన్ వరువెన్’, ‘యాక్షన్’ సినిమాల సమయంలో దర్శకుడు సుందర్ సి దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ‘ఎలెవెన్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని..

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోందని తెలుస్తోంది. నిజానికి నవీన్ చంద్ర ‘శరభం’, ‘శివప్పు , ‘బ్రమ్మన్’ లాంటి తమిళ చిత్రాలలో కూడా నటించగా ప్రస్తుతం దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’, కార్తీక్ సుబ్బరాజ్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లలో కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇక ‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి కథానాయికగా నటిస్తున్న ‘ఎలెవెన్’లో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్ గా పని చేస్తున్న ఈ షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమవుతుంది.

Show comments