Site icon NTV Telugu

Yevam: చాందిని చౌదరి హీరోయిన్ గా నవదీప్ సొంత సినిమా!

Eevam

Eevam

Chandini Chowdary: ‘కలర్ ఫోటో’, ‘సమ్మతమే’ చిత్రాలతో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి. అంతేకాదు షార్ట్ ఫిల్మ్స్ తో పాటు వెబ్ సీరిస్ లోనూ నటించి పేరు సంపాదించుకుంది. తాజాగా ఆమె ‘ఏవమ్’ చిత్రంలో నాయికగా నటిస్తోంది. విశేషం ఏమంటే దీన్ని నటుడు నవదీప్ తన మిత్రుడు పవన్ గోపరాజుతో కలిసి నిర్మిస్తున్నాడు. గతంలో సి-స్పేస్ బ్యానర్ పై వీళ్ళు ‘లవ్, మౌళి’ అనే సినిమాను నిర్మించారు. ఇది ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న రెండో సినిమా. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రదేశాలలో జరుగుతోంది. చాందినీ చౌదరితో పాటుగా ఇందులో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్, ‘కేజీఎఫ్‌, నారప్ప’ ఫేమ్ వశిష్ఠ ఎన్. సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ‘ఓం శాంతి’ చిత్ర దర్శకుడు ప్రకాశ్ దంతులూరి తెరకెక్కిస్తున్నాడు. దివ్య నారాయణన్ సంభాషణలు సమకూర్చుతున్న ‘ఏవమ్’కు నిర్బయ్ కుప్పు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version