NTV Telugu Site icon

Navdeep: అక్కడ అంత రచ్చ జరుగుతుంటే ఇక్కడ రొమాన్స్ ఏంటి గురూ?

Navdeep

Navdeep

డ్రగ్స్ స్కాండల్ తో ఒక పక్కన టాలీవుడ్ చిక్కులో పడుతుంది, హీరో నవదీప్ కనిపించట్లేదు అనే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. పోలీసులు నవదీప్ డ్రగ్స్ వాడాడు, నోటీసులు ఇస్తాం అంటూ ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నవదీప్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే నేనెక్కడికీ పారిపోలేదు అంటూ బయటకి వచ్చిన నవదీప్… ఇవన్నీ మాములే అన్నట్లు తన సినిమాకి సంబంధించిన సాంగ్ ని బయటకు వదిలాడు. నవదీప్ 2.0గా ఆడియన్స్ ముందుకి రానున్న నవదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మౌళి’. హిప్పీ కల్చర్ ని బేస్ చేసుకొని డిజైన్ చేసిన ఈ కథలో నవదీప్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ నవదీప్ లుక్ అట్రాక్టివ్ గా అనిపించింది. లాంగ్ హెయిర్ తో, ఫుల్ బియర్డ్ తో నవదీప్ మంచి మేకోవర్ చూపించాడు.

అవనీంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ‘ది యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పొయిటిక్ లిరిక్స్ రాయగా… గోవింద్ వశిష్ట ఇచ్చిన ట్యూన్ ఆకట్టుకుంది. లిరికల్ వీడియోలో హీరో నవదీప్, హీరోయిన్ ఫంకూరి గిద్వాని పెయిర్ ఆకట్టుకుంది. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరినట్లు ఉంది, లిరికల్ వీడియోలోనే రొమాన్స్ పండించారు. లిరికల్ వీడియో డిజైన్ చేసిన విధానం చాలా కొత్తగా, రీఫ్రెషింగ్ గా ఉంది. దీంతో లవ్ మౌళికి ఈ సాంగ్ మంచి బజ్ జనరేట్ చేసేలా ఉంది. అసలు బయట ఉన్న హీట్ కి నవదీప్ అవేమి పట్టనట్లు సాంగ్ ని వదలడం హైలైట్ అనే చెప్పాలి.