Site icon NTV Telugu

Navdeep: పెళ్లి పీటలు ఎక్కుతున్న మరో యంగ్ హీరో.. ?

Nadeep

Nadeep

Navdeep: టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ఇక తాజాగా మరో హీరో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జై అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవదీప్. పిల్లి కళ్ళతో డిఫరెంట్ గా కనిపించి.. తనదైన నటన కనబరుస్తూ మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా, విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో మెప్పిస్తూ వస్తున్నాడు. సినిమాలతో పాటు ఇంకోపక్క పబ్.. మరోపక్క ప్రొడక్షన్ హౌస్ నడుపుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక నవదీప్.. ఎప్పటినుంచో డ్రగ్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నవదీప్ పెళ్లి గురించి మాత్రం ఏరోజు మాట్లాడింది లేదు. తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, మా అమ్మ, నానమ్మ చెప్పినా కూడా తాను పెళ్లి చేసుకోబోయేది లేదని నవదీప్ చెప్పుకొచ్చాడు. ఇక ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా నవదీప్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ చెప్పి తప్పించుకుంటూ ఉండేవాడు. ఇక ఈసారి మాత్రం కొత్త లాజిక్ తో వచ్చి షాక్ ఇచ్చాడు.

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో మరో స్టార్ హీరో.. ?

తాజాగా నవదీప్ ట్విట్టర్ లో ఒక వీడియో షేర్ చేశాడు. అందులో నవదీప్ మాట్లాడుతూ.. “పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్ ఇండియా.. పొద్దున్నే నన్ను ఓ క్వశ్చన్ అడిగింది. నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్ అయితే.. పాపం పెళ్లిళ్లు వర్కవుట్ అవ్వక విడాకులు తీసుకునేవాళ్లు.. మళ్లీ ఎందుకు పెళ‍్లి చేసుకుంటారా? అని అడిగింది.. ఆ మాటతో నేను క్విట్ అయ్యాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇంత లాజిక్ గా చెప్పాకా ఎవరు కాదంటారు అనే విధముగా నవదీప్ మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అంతేకాకుండా జరగాలి పెళ్లి అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో నవదీప్ పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఉన్నాడు. ఇదే కనుక నిజంటే.. త్వరలో ఈ కుర్ర హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కుతాడు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి.

Exit mobile version